logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గ్యాస్ ఏజెన్సీ లే అక్రమ వ్యాపారాలకు తెరలేపి చివరికి టాస్క్ ఫోర్స్ పోలీసుల చిక్కి కటకటాల్లోకి

తెలంగాణ స్టేట్*** హైదరాబాద్**మార్చి 30**(ఏఐఎంఏ మీడియా)


*బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలోని స్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ...*

బంజారాహిల్స్‌లో అక్రమ గ్యాస్ సిలిండర్ల ముఠా అరెస్ట్:


హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఘటనలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు.
బంజారా హిల్స్‌లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న10 మంది నిందితులను అరెస్ట్ చేశారు.జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ మరియు బంజారాహిల్స్ పోలీసుల సంయుక్త దాడిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో 10 మంది అరెస్ట్ చేసి నిందితుల నుండి 414 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకొని అదేవిధంగా గ్యాస్ అక్రమ సిలిండర్లు రవాణా చేస్తున్న వాహనాలు 10 సిజ్ చేశారు,
(డీసీఎంలు, బొలెరో, టాటా ఏస్, ఆటోలు) వీటి మొత్తం విలువ: ₹21.88 లక్షలు
ప్రధాన నిందితుడు:మొహమ్మద్ అమీర్ – “మెట్రో గ్యాస్ ఏజెన్సీ” నిర్వాహకుడు. యుద్ధం సాకు చూపి ప్రజలను ఎల్పిజి గ్యాస్ సప్లై తగ్గిందని గ్యాస్ వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ శంషాబాద్ కేంద్రంగా అక్రమ గ్యాస్ వ్యాపారం నడిపిస్తూ…
బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్. సమీపంలోని స్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ.
అక్కడి నుండి వినియోగదారులకు ప్రభుత్వ ధరల కంటే ఎక్కువకు విక్రయం చేస్తున్నారని పక్క సమాచారంతో.
టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ యుగేందర్ బృందం విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడి చేసి నిందితులను, సీజ్ చేసిన వస్తువులను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
ప్రజల భద్రతకు ముప్పు కలిగించే అక్రమ గ్యాస్ వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ సందర్భంగా పోలీసులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎక్కడైనా అక్రమంగా గ్యాస్ విక్రయిస్తున్న వారి వివరాలు తెలపాలని తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.

153
4941 views

Comment