logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మృతుని కుటుంబానికి 57 లక్షల రూపాయలు నష్టపరిహారం *కార్మిక సంఘాలకు దుర్గ ఓబీ కంపెనీ యాజమాన్యానికి కుదిరిన ఒప్పందం ,

తెలంగాణ స్టేట్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* మణుగూరు టౌన్* మార్చి 30 **(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి 9652413118)
************************************

కార్మిక సంఘాలకు దుర్గ ఓబీ కంపెనీ యాజమాన్యానికి కుదిరిన ఒప్పందం
మృతుని కుటుంబానికి యాభై ఏడు లక్షల రూపాయలు నష్ట పరిహారం
గాయ పడిన వారికి మెరుగైన వైద్యం ప్రమాదాల నివారణకు పటిష్టమైన రక్షణ చర్యలు

మణుగూరు ఏరియా వి.పి.ఆర్ అనుబంధ దుర్గా ఇన్ ఫ్రా ఓబీ కంపెనీ ఆదివారం సాయంత్రం జరిగిన సాని డంపర్ టైరు పేలిన ప్రమాద సంఘటనలో మృతుడు మొహమ్మద్ సర్ఫేజ్ (40) కుటుంబానికి వర్క్ మెన్ కాంపెన్సేషన్, ఎక్స్ గ్రేషియా అన్ని కలిపి 57 లక్షల రూపాయలు అందులో 43 లక్షల రూపాయలు నెల రోజులు లోగా కార్మిక సంఘాల సమక్షంలో బాధిత కుటుంబానికి నేరుగా చెల్లించేలా, వర్క్ మెన్ కాంపెన్సేషన్ సుమారు పద్నాలుగు లక్షలు రూపాయలు కార్మిక శాఖ ఆధ్వర్యంలో చట్టపరంగా చెల్లించేలా ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులది మరియు భౌతికకాయాన్ని బీహార్ పంపడం అక్కడ అంతిమ సంస్కార ఖర్చులు అన్ని ఓబి యాజమాన్యమే భరించేలా, మణుగూరులో సంబంధిత కంపెనీ మట్టి వెలికితీత పనులు కాంట్రాక్ట్ కొనసాగినంత కాలం ఆ కుటుంబానికి జీతం చెల్లించడం, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడం వారు కోలుకునేలా చూడాల్సిన బాధ్యత కూడా ఓబీ యాజమాన్యానిదే ఇలా సింగరేణి అధికారుల మధ్యవర్తిత్వంలో దుర్గ ఇన్ ఫ్రా ఓబీ కంపెనీ యాజమాన్యానికి మణుగూరు ఏరియా కార్మిక సంఘాలు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ, ఏరియా ప్రాతినిధ్య సంఘం ఐ ఎన్ టి యు సి,
ఐ ఎఫ్ టి యు నాయకులతో ఓబి వర్కర్ల సమక్షంలో ఆదివారం అర్ధరాత్రి ఉత్కంఠ భరిత వాతావరణం లో వ్రాతపూర్వక ఒప్పందం జరిగింది, ప్రమాద సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలి ఇలాంటి ప్రమాద సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని, రక్షణ అవగాహన సదస్సులు నిర్వహించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం మృతునికి నివాళులర్పించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం ఓసీ-2 లో జరిగిన ప్రమాద సంఘటన దురదృష్ట సంఘటనగా అభివర్ణిస్తూ పోయిన ప్రాణాన్ని తీసుకురాలేకపోయిన చిత్తశుద్ధి గల కార్మిక సంఘాలుగా తమ వంతు కర్తవ్యం గా బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా మానవతా దృక్పథంతో కృషి చేశామని ఏఐటీయూసీ నాయకులు వై రాంగోపాల్, ఐ ఎన్ టి యు సి నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, ఐ ఎఫ్ టి యు నాయకులు యస్ డి నాసర్ పాషా విలేఖరులకు తెలిపారు. చర్చలు సుదీర్ఘ సమయం కొనసాగినా కూడా మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా, గాయపడిన వారికి సత్వర వైద్యం అందేలా అన్ని విధాలుగా దగ్గరుండి చూసుకున్న ఏరియా జిఎం దుర్గం రామచందర్ గారికి డీజిఎం పర్సనల్ రమేష్ గారికి, పీకే ఓసి ప్రాజెక్టు అధికారి శ్రీ రమేష్ గారికి, వైద్యులకు ఒప్పందానికి సానుకూలంగా స్పందించిన దుర్గ ఓబీ కంపెనీ మేనేజర్ ధోలు బిపిన్, సునీల్ గార్లకు,ఇతర సిబ్బందికి ఓబి వర్కర్లకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఐ నాగబాబు గారి ఆధ్వర్యంలో పోలీసులు సర్ఫెజ్ భౌతికకాయానికి శవపంచనామా నిర్వహించి, వంద పడకల ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం అంబులెన్స్ లో తన స్వగ్రామం బీహార్ లోని వైశాలి జిల్లా మజియా గ్రామం తరలింపు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్,పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు ఎస్ శ్రీనివాస్, రామేశ్వర్, వంశీ,కిరణ్, బిజెపి నాయకులు జంపన సీతారామరాజు, కార్మిక సంఘాల నాయకులు మేకల ఈశ్వర్, శనిగరపు కుమారస్వామి సురేందర్,సిలువేరు గట్టయ్య, షేక్ అబ్దుల్ రవూఫ్, అంగోత్ మంగీలాల్, ఓబి వర్కర్స్ యూనియన్ నాయకులు మధుబాబు, హరి, రవి పెద్ద ఎత్తున ఓబీ వర్కర్లు పాల్గొన్నారు.

240
7145 views

Comment