కామారెడ్డిజిల్లా కేంద్రంలో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి..
కామారెడ్డి ప్రతినిధి
30-03-2026
కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా రోడ్డులో నూతనంగా 'విశాల షాపింగ్ మాల్, ఏర్పాటు
చేశారు.ముఖ్య అతిధిగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ నటి నిధి అగర్వాల్ విచ్చేసారు.హీరోయిన్ నిధి అగర్వాల్ రాకతో సందడి వాతావరణం నెలకొంది. అధిక సంఖ్యలో హీరోయిన్ రాకకోసం చాలాసేపు ఎండకు సైతం లెక్కచేయకుండా జనం ఉత్సాహంగా ఎదురు చూసారు.అక్కడికి
తరలివచ్చిన అభిమానులు
హీరోయిన్ వస్తుందన్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్దఎత్తున షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. అభిమాన నటిని చూసేందుకు ఉత్సాహం చూపారు. ఉదయం 10:30 గంటలకు రావాల్సిన నటి మధ్యాహ్నం 12:00 గంటలకు చేరుకున్నారు. సుమారు రెండు గంటలు జనాలు ఎండలో వేచి ఉన్నారు. నిధి అగర్వాల్ షాపింగ్ మాల్ వద్దకు చేరుకోగానే అభిమానులకు అభివాదం చేసింది. అనంతరం ప్రారంభోత్సవం చేసిన తరువాత లోపలికి వెళ్లి జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. పలువురు నిధి అగర్వాల్‌తో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. హీరోయిన్ రాక సందర్భంగా జనాల రద్దీతో ఒకవైపు ట్రాఫిక్ నిలిపివేశారు. నిజాంసాగర్ నుంచి బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలను లయోల స్కూల్ ముందు రోడ్డు నుంచి మున్సిపల్ కార్యాలయం మీదుగా పోలీసులు దారి మళ్లించారు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సుమారు గంటపాటు హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేసారు. నిధి అగర్వాల్ వెళ్ళిపోగానే ప్రజలు షాపింగ్ మాల్ లోకి వెళ్లి షాపింగ్ మాల్ పట్ల సంతృప్తి చెందినమని సంతోషం వ్యక్తం చేసారు. మధ్యాహ్నం తరువాత
వాహనాల రాకపోకలు సజావుగా సాగాయి.