logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణ ఉద్యమకారుల అరెస్ట్: హామీల అమలుకు డిమాండ్

జర్నలిస్ట్: ఆకుల గణేష్

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల ఫోరం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్‌లను సోమవారం కొయ్యూరు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చాలని, ఉద్యమకారులను గుర్తించేందుకు వెంటనే సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఉద్యమకారులకు పెన్షన్లు, 250 గజాల స్థలం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల నిర్బంధాలు మానుకొని, సానుకూలంగా స్పందించి హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

1
221 views

Comment