రేగొండ: తిరుమలగిరిలో ఆగని గుడుంబా విక్రయాలు..!
జర్నలిస్ట్: ఆకుల గణేష్
రేగొండ మండలంలోని తిరుమలగిరితో పాటు పలు గ్రామాల్లో గుడుంబా విక్రయాలు తీవ్రంగా సాగుతున్నాయని, దీనిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి స్వయంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు సమాచారం. గ్రామాల్లో గుడుంబా నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఉన్నతాధికారులు స్పందించి గుడుంబా స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.