logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కారు యజమాని నిర్లక్ష్య వైఖరి ... విజయవాడ దుర్గ ఆలయం అర్చకుడు పాణిగ్రాహి జగన్మోహన్ శర్మ దుర్మరణం...



రోడ్డు ప్రమాదం మరొక నిండు ప్రాణాలు బలి తీసుకుంది....
ఒక కారు యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలయింది.విజయవాడ పరిధిలో సీతానగరంలో జరిగిన హృదయ విదారక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జన్మరిత్యా పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామం కి చెందిన పాణిగ్రహి సత్తిబాబు ప్రథమ పుత్రుడు.విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం లో అర్చకుడిగా పని చేస్తున్నారు. చెందిన పాణిగ్రాహి జగన్మోహన్ శర్మ విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం లో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం విధుల నిమిత్తం ఆయన తన నివాసం నుంచి ఆలయానికి బయలుదేరారు.విజయవాడ పరిధిలో సీతానగరం పీహెచ్సీ సమీపంలోకి రాగానే ఆయన నడుపుతున్న వాహనాన్ని పీ.హెచ్. సి నుంచి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ వచ్చిన వ్యక్తి బలంగా ఢీకొన్నాడు. దీంతో అర్చకులు రోడ్డుపై పడడంతో తీవ్ర గాయమై రక్తస్రావం అయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మెదడుకు గట్టిగా తగలడంతో ఆరు రోజులుగా ఆయన మృత్యువుతో పోరాడుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేనా సరైన రీతిలో స్పందించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు కారు యజమానిని అరెస్టు చేయడం గాని, పిలిపించడం మాట్లాడటం గాని పోలీసులు చేయలేదంటే దీని వెనక ఎవరు ఉన్నారో అని అర్థం కావడం వాపోతున్నారు. మరో ఏడదిన్నార పదవి విరమణ చేయాల్సిన వయసులో ఆయన మృతి కుటుంబాన్ని తీవ్ర శో కసంద్రంలోకి నెట్టింది. కుటుంబంలో విషాదాన్ని నింపిన కారు యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0
35 views

Comment