logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మండలంలో ఆసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలి మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ప్రారంభం. బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ పరిశీల

పత్రిక ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చ్ 30 :-
మండలంలో ఆసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలి

మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ప్రారంభం.

బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ పరిశీలన.


రిబ్బన్ కట్ చేసి నూతన గదిని ప్రారంభించిన మహిళా కానిస్టేబుళ్లు

గంజాయి, గుడుంబా, రాయితీ బియ్యం, పశువుల అక్రమ రవాణా పై దృష్టి సారించాలి.

గ్రామాలను సందర్శిస్తూ విపిఓ విధానాన్ని పూర్తిగా అమలు చేయాలి.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

జిల్లాలో మహిళల భద్రత, రక్షణ చర్యలు పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు, జిల్లా పోలీసు యంత్రాంగం మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యతను కేటాయిస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలిపారు. ఈరోజు బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ నందు మహిళా పోలీసు సిబ్బంది నిత్యవసర అవసరాల నిమిత్తం ప్రత్యేకంగా నూతన గదిని జిల్లా ఎస్పీ శాస్త్రోక్తంగా, వేద మంత్రోచరణల నడుమ ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుళ్లు రిబ్బన్ కట్ చేయించి, పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన గదిని ప్రారంభించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాల ప్రస్తుత స్థితిగతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు జరగాలని తెలిపారు. మహిళల రక్షణకై షీ టీం 24 గంటలు అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలను చేపడుతున్నట్టు పేర్కొన్నారు. విపిఓ విధానాన్ని అమలు చేస్తూ గ్రామస్థాయిలో జరిగే ప్రతి అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని, సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో సిసిటీవీ కెమెరాల ఏర్పాటు దిశగా కృషి చేయాలని తెలిపారు. గ్రామాలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా మండల పరిధిలో గంజాయి లేకుండా గంజాయి రహిత జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని అదేవిధంగా గుడుంబా లేకుండా, ప్రభుత్వ రాహితీ బియ్యం అక్రమంగా తరలకుండా, పశువుల రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసులు పూర్తి చేసి చార్జిషీట్‌లు దాఖలు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, బోథ్ సిఐ డి గురుస్వామి, బజార్హత్నూర్ ఎస్ఐ జి సంజయ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment