జనగణన–2027 నిర్వహణకు సంబంధించి గృహ సముదాయాల బ్లాక్‌లు (హౌజ్ లిస్టింగ్ బ్లాక్‌లు)ను ఖచ్చితంగా గుర్తించి, వాటి వివరాలను సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్
పత్రికా ప్రకటన
మార్చి 30, 2026-ఆదిలాబాద్
జనగణన–2027 నిర్వహణకు సంబంధించి గృహ సముదాయాల బ్లాక్‌లు (హౌజ్ లిస్టింగ్ బ్లాక్‌లు)ను ఖచ్చితంగా గుర్తించి, వాటి వివరాలను సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్
సిస్టమ్ పోర్టల్‌లో నమోదు చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలికేరి జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో జనగణన–2027 విధి విధానాలపై ఆమె సమగ్రంగా చర్చించారు.
మే 11 నుంచి ప్రారంభం కానున్న జనగణన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి జిల్లాలో అవసరానికి 10 శాతం అధికంగా ఎన్యుమేటర్లు, సూపర్వైజర్లను గుర్తించి నియమించాలని సూచించారు. నియమితులైన వారి పూర్తి వివరాలను సీఎంఎంఎస్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని పేర్కొన్నారు.
ఎన్యుమేటర్ల నియామకంతో పాటు, ముందస్తుగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లను జనాభా ఆధారంగా, రెవెన్యూ గ్రామాలు, పంచాయతీలు, వార్డుల వారీగా హౌజ్ లిస్టింగ్ బ్లాక్‌లుగా విభజించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, ఇళ్లను ప్రత్యక్షంగా గుర్తిస్తూ బ్లాక్‌లను రూపొందించాల్సిందిగా సూచించారు.
ఒక్కో హౌజ్ లిస్టింగ్ బ్లాక్‌లో సుమారు 700 నుంచి 850 మంది జనాభా ఉండేలా సమతుల్యంగా విభజన చేయాలని తెలిపారు. ఫీల్డ్ స్థాయిలో పరిశీలన లేకుండా బ్లాక్‌లను రూపొందిస్తే, కొన్ని ఇళ్లు మిస్సయ్యే అవకాశం ఉండటంతో పాటు, కొన్నిచోట్ల అధిక జనాభా, మరికొన్నిచోట్ల తక్కువ జనాభా ఉండే ప్రమాదం ఉంటుందని,
అందువల్ల హౌజ్ లిస్టింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, హౌజ్ లిస్టింగ్ బ్లాక్‌లను నిబంధనలకు అనుగుణంగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్యుమేటర్లు, సూపర్వైజర్లను కూడా అవసరానికి మించి 10 శాతం వరకు నియమించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్ర, ఆర్డీవో స్రవంతి, డీఆర్‌డీఏ పి డి రవీందర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.