logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రయివేట్ వైద్యానికి ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడం


జరుగుతుందని ప్రజలు ఆ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ అన్నారు. సోమవారం ప్రజాపాలన ప్రత్యేక ప్రణాళికల 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శాంతినగర్ లోని పుత్లీబౌలి అర్బన్ హెల్త్ సెంటర్లో స్పెషలిస్ట్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. దీనికి మున్సిపల్ చైర్పర్సన్ ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ప్రజలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు చైర్పర్సన్ను కలిసి వారి సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తన వంతుగా ఆశాలకు సహకారం అందిస్తానని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్
మాట్లాడుతూ.ప్రభుత్వం ప్రజాల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 99
రోజుల ప్రత్యేక ప్రణాళికలతో స్పెషలిస్ట్ వైద్యులతో శిబిరాలను నిర్వహించి వారికి వైద్య సేవలను అందిస్తుందన్నారు. పుత్లీబౌలి అర్బన్ హెల్త్ సెంటర్ ప్రయివేట్కు ధీటుగా
ఉందని, ఇక్కడ పరిశుభ్రత, వైద్యుల తీరు బాగుందని కొనియాడారు. డబ్బులున్న వారు
ప్రయివేట్ వైద్యం చేసుకుంటారని.. అదే కూలీ పనులు చేసుకునే వారికి ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయివేట్లో లభించే అన్ని రకాల టెస్టులు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ వైద్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ ఓ డాక్టర్ సాధన, స్థానిక కౌన్సిలర్ నజీర్,శ్రీకాంత్ స్పెషలిస్ట్ వైద్యులు సందీప్ కుమార్, దీపక్, ఆస్పత్రి నర్సింగ్ ఆఫీసర్ చంద్రకళ, సీఓ నవీన్ కుమార్, నాయకులు బండారి సతీష్, ,మనోజ్ ,తౌఫిక్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0
78 views

Comment