ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.
పోలీసుల పట్ల నమ్మకం పెరిగేలా విశ్వాసం కలిగించాలి.
పత్రికా ప్రకటన
అదిలాబాద్ జిల్లా,
మార్చి 30 :-
పోలీసు ముఖ్య కార్యాలయం నందు 28 ఫిర్యాదుల స్వీకరణ
ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు.
ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాల సమాచారం 8712659973 నెంబర్ కు వాట్సప్ ద్వారా తెలియజేయాలి.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రతి సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నందు నిర్వహించే ప్రజా ఫిర్యాదులను కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారుల దయచేసి తమ సమస్యలను జిల్లా ఎస్పీకి స్వయంగా తెలియజేశారు. సమస్యలను విన్న జిల్లా ఎస్పీ పేరుగా సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి శాశ్వత పరిష్కారాలు చూపాలని, బాధితుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడు పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఈరోజు పోలీసు ముఖ్య కార్యాలయంలో దాదాపు 28 ఫిర్యాదులను సేకరించడం జరిగింది. వచ్చిన ఫిర్యాదులలో కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కేసుల పురోగతి, భూ సమస్యలు, తదితర విషయాలు ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అసంఘిక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్న 8712659973 నెంబర్ కు వాట్సప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. గంజాయి, గుడుంబా, పేకాట, మాదకద్రవ్యాలు, ఎలాంటి వాటిపైన అయిన సమాచారం అందించవచ్చు. ఈ వాట్సాప్ నంబరు నేరుగా జిల్లా ఎస్పీ గారికి నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.