ఆదిలాబాద్ జిల్లా సహకార శాఖ ఇంచార్జి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మాదా సత్యనారాయణ సోమవారం కలెక్టరేట్
పత్రికా ప్రకటన
మార్చి 30, 2026 – ఆదిలాబాద్
సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
జిల్లాలో సహకార రంగ అభివృద్ధి, రైతులకు అందిస్తున్న సేవలు, ప్రస్తుత కార్యక్రమాల అమలు తదితర అంశాలపై కలెక్టర్ తో చర్చించారు. సహకార సంఘాల బలోపేతానికి, పారదర్శకంగా సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తానని మాదా సత్యనారాయణ పేర్కొన్నారు.
జిల్లా అభివృద్ధిలో సహకార శాఖ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, రైతు సంక్షేమానికి ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు