logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఓవరాల్ ఛాంపియన్స్‌గా అదిలాబాద్ జిల్లా క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ అభినందనలు

పత్రికా ప్రకటన
మార్చి 30, 2026-ఆదిలాబాద్



స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్–2025 (సెకండ్ ఎడిషన్) పోటీలలో అదిలాబాద్ జిల్లా ఓవరాల్ ఛాంపియన్స్‌గా ప్రథమ స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా క్రీడాకారులు, జిల్లా క్రీడల అధికారి జక్కుల శ్రీనివాస్, కోచ్‌లు, సంబంధిత సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. క్రీడా రంగంలో అదిలాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమని అన్నారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల మధ్య పోటీ వాతావరణంలో అదిలాబాద్ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుని ఓవరాల్ ఛాంపియన్స్‌గా నిలవడం విశేషమని కలెక్టర్ పేర్కొన్నారు. క్రీడాకారులు భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో కృషి చేసి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా సీఎం కప్ పోటీల విజయవంతమైన నిర్వహణలో భాగంగా చేపట్టిన క్రీడా జ్యోతి ర్యాలీలు, ఆన్లైన్ నమోదు ప్రక్రియ, మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీల సమర్థ నిర్వహణ కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఈ విజయానికి క్రీడాకారులతో పాటు కోచ్‌లు, క్రీడా శాఖ సిబ్బంది సమష్టి కృషి కారణమని అభినందించారు.

జిల్లా క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని యువత మరింతగా క్రీడల వైపు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ట్రైనింగ్ కలెక్టర్ సలోని చాబ్ర ఆర్డీఓ స్రవంతి, డిఆర్డీఓ రవీందర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

1
0 views

Comment