logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*ఏపీలో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను* *నిజం చేయడమే కూటమి ప్రభుత్వ* *లక్ష్యం... ఎమ్మెల్యే కూన రవికుమార్* *గారు

AIMA న్యూస్ :
*ఆముదాలవలస మున్సిపాలిటీ లో 295* *మంది లబ్ధిదారులకు ఘనంగా* *గృహప్రవేశ కార్యక్రమం...*

👉ఆముదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస పట్టణంలో 5 వ వార్డు సొట్టవాని పేట కాలనీలో లో గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

👉 పీఎంఏవై పథకంలో భాగంగా ప్రతి లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో విడతల వారీగా రెండు లక్షల 30 వేల రూపాయలు జమ చేయడం జరిగింది.
.
👉ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

👉గృహప్రవేశం పొందిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, తమకు ప్రభుత్వం అందించిన సహకారానికి సీఎం గారికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

👉ఈ గృహప్రవేశ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల మంది లబ్ధిదారుల కుటుంబాలు తమ సొంత ఇళ్లలోకి అడుగుపెట్టడం ఆనందదాయకమని, ఇది వారి జీవితాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

👉 ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్ గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ గీతా విద్యా సాగర్ గారు, పట్టణ అధ్యక్షుడు, మురళి గారు కూటమి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

0
274 views

Comment