logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సాలూరు టౌన్ లో యదేచ్చగా కబ్జాలు... చోద్యం చూస్తున్న మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు



వెంటనే ప్రభుత్వ స్థలాలు గుర్తించి బోర్డులు ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్.
మన్యం జిల్లాలో సాలూరు పట్టణంలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు మరియు చెరువులను పెద్దలు ఆక్రమిస్తున్నారు... అయినా సరే రెవెన్యూ, మున్సిపాలిటీ యంత్రాంగం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని సిపిఎం మన్యం జిల్లా కమిటీ తెలిపింది.
వేద సమాజం జంక్షన్ లో రాని చెరువు పూర్తిగా ఆక్రములకు గురైందని, దానిని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ వై నాయుడు స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారని,
పూర్వం నుండి మెయిన్ రోడ్ నుండి రానీ చెరువులోకి అక్కడి నివాస ప్రజలకు రస్తాగా ఉన్న స్థలం కూడా ఆక్రమణలకు గురవడం అంటే
అధికారులు ఆక్రములను ఎంత ప్రోత్సహిస్తున్నారు అర్థమవుతుందని తెలిపారు.
దాదాపు పట్టణంలో ఖాళీ స్థలాలు మరియు చెరువుల అన్నింటి పరిస్థితి ఇలానే ఉందని,
పార్కులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు గురయ్యాయని,
జాతీయ రహదారికి అనుకొని ఉన్న బైపాస్ రోడ్డు జంక్షన్ చెరువులు,
మక్కువ రోడ్ లోని చెరువు,
పేరసాగరం మరియు బంగారమ్మ కాలనీ పార్కు మరియు మరిన్ని మున్సిపల్ ఖాళీ ప్రదేశాలు ఎలాంటి మార్కింగులు లేకపోవడం వల్ల కబ్జా గురవుతున్నటువంటి పరిస్థితి ఉందని తెలిపారు.
ఈ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ వెంటనే కలుగజేసుకొని రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులతో సమీక్ష చేసి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా,
ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించి రక్షణ కల్పించేలా విస్తీర్ణానికి సంబంధించిన వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పేదలకు నివాసం ఉన్నచోటే పట్టా ఇవ్వాలని ఆదేశాలు ఉన్న అమలు చేయని అధికారులు,
పెద్దవాళ్లు ఆక్రమణలు చేస్తుంటే మాత్రం సహకరిస్తున్నారు అనిపిస్తుందని,
వెంటనే జిల్లా అధికారులు కలుగజేసుకొని ఆక్రమణదారుల నుండి ప్రభుత్వ స్థలాలు కాపాడాలని, చెరువులు కాపాడాలని డిమాండ్ చేశారు.
లేకుంటే పేదలందరికి ఆయా స్థలాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం స్పందించుకుంటే పేదలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

396
13738 views

Comment