గ్యాస్ నిల్వలు ఉన్నాయి-వినియోగదారులు సంయమనం పాటించాలి: జాయింట్ కలెక్టర్ కే. కార్తిక్.
నంద్యాల (AIMA MEDIA ): జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయి అని, జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, జిల్లా జాయింట్ కలెక్టర్ కే. కార్తిక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ల వద్ద తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నందున గ్యాస్ వినియోగదారులు ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని, వచ్చే రోజుల్లో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే అపోహతో గ్యాస్ వినియోగదారులు అధికంగా అదనపు బుకింగ్స్ చేయడం వలన సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని, కావున గ్యాస్ వినియోగదారులు సంయమనం పాటించితే గ్యాస్ బుకింగ్ చేసుకున్న డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులందరికీ వారి ఇంటి వద్దనే సక్రమంగా డోర్ డెలివరి చేయడం జరుగుతోందని తెలిపారు. గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెంది గ్రామాలలో గ్యాస్ సిలిండర్ ఆటో ల వద్ద గుంపులు గుంపులుగా చేరవద్దని,సహకరించాలని, ఎవరుకూడా గ్యాస్ సిలిండర్ ఆటో ల వద్ద గ్యాస్ సిలిండర్ ల కోసం గుమికుడవద్దని కోరడం అయినది.జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ ఏజెన్సీ వారు వంట గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టరు కె. కార్తీక్ గారు హెచ్చరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్ కు తరలించినా తగిన చర్య తీసుకుంటామన్నారు.అదేవిధంగా, ఎవరైనా గ్యాస్ వినియోగదారులు తమకు కేటాయించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను హోటల్స్, టిఫిన్ సెంటర్లు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు విక్రయించినట్లు తెలిసిన యెడల, వారి సబ్సిడి నిలిపివేయడం మరియు గ్యాస్ కనెక్షన్ రద్దు చేయటం జరుగుతుంది అని హెచ్చరించారు.కొందరు అపోహలు సృష్టించి బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ను ఎక్కువ ధరకు విక్రయాలు చేస్తున్నట్లయితే అటువంటి వారిపై కటినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది.గ్యాస్ సమస్యల పై కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నంబర్ 08514-293903 కు ఫిర్యాదు చేయవలెను. ఎవరైనా డెలివరి బాయ్స్ వినియోగదారులతో అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లులో పేర్కొన్న మొత్తానికి మించి డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే సంబందిత పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారు, సంబంధిత మండల తహశీల్దారు, జిల్లా పౌరసరఫరాల అధికారి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1967 మరియు కమాండ్ కంట్రోల్ నంబర్ 08514-293903 కు ఫిర్యాదు చేయవలసిందిగా కోరడమైనది.