పెళ్లి వేడుకలో పాల్గొన్నా గ్రామీణ వైద్యుల సంఘం నేతలు.
నంద్యాల (AIMA MEDIA): బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యులు భాష, హసీనాబీ దంపతుల కుమారుడు షేక్ మహబూబ్ బాషా వివాహ వేడుకలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రొక్కం నాగేశ్వర రెడ్డి గారు, జిల్లా నాయకులు డి. నాగేశ్వరరావు, రమేష్ రావు, యాకూబ్, నాగరాజు, బాలుడు, సోహైల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు నూతన దంపతులను కలసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. దంపతులు ఆనందంగా, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.పెళ్లి వేడుకలో పాల్గొన్న అతిథులు, బంధుమిత్రులు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకుంటూ, దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.