ఇరాన్ ప్రజలపై అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా ఛలో హైదరాబాద్..సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ..
హైదరాబాద్, 29 మార్చి 2026
అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదుల దాడులకు నిరసనగా పోరాడుతున్న ఇరాన్ దేశ ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్లు మరియు నిరసనగా ఛలో హైదరాబాద్ కార్యమాన్ని చేప్పట్టినట్లు సిఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ)ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు ఓ ప్రకటనలో తెలిపారు. యుద్ధ వ్యతిరేక ర్యాలీ జయప్రదం చేయాలని ఆయన కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల్లో శాంతి పలుకులు, ఆచరణలో దురాక్రమణ విధానాన్ని అవలంబిస్తున్నారని దాసు అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతర్జాతీయ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి, ఐక్యరాజ్యసమితి, భద్రతా సమితి విధానాలను విస్మరించి ఏకపక్షంగా ఇరాన్ ప్రజలపై దుర్మార్గపు యుద్ధాన్ని చేస్తున్నాడని ఆయన అన్నారు. ఇరాన్ పాలకులు టెర్రరిస్టులు అంటున్న డోనాల్డ్ ట్రంపే అసలైన టెర్రరిస్ట్ అని దాసు తెలిపారు. గతంలో ఇరాక్, వెనిజులా, నేడు ఇరాన్ పై కేవలం చమురు ఉత్పత్తులపై నియంత్రణ కోసం దుర్మార్గపు దాడులను చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజాస్వామిక విలువలను పాతరేస్తున్న, ఇరాన్ ప్రజలను అమానుషంగా చంపుతున్న అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదుల దాడుల్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖండించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. ఇరాన్ దేశ నేతలను అమెరికాతో దౌత్యం చేయాలని సూచించడం, పరోక్షంగా అమెరికా ఇజ్రాయిల్ దాడులను సమర్ధించడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరాన్ ప్రజలపై దుర్మార్గపు యుద్ధము వలన ప్రపంచంలో చమరు ఉత్పత్తి సంక్షోభం ఏర్పడుతుందని, భారతదేశంపై కూడా దాని ప్రభావం పడిందని ఆయన తెలిపారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్, కొరతలు ఏర్పడి
నిత్యవసర ధరలు పెరిగి ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆయన అన్నారు. కొందరు ముస్లిం దేశమని, గుడ్డిద్వేషంతో
వ్యాఖ్యానాలు చేస్తున్నారు తప్ప దేశ ప్రజలపై పడుతున్న భారాన్ని ఎందుకు గమనించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామిక సూత్రాలు వల్లిస్తున్న ట్రంప్ దుర్మార్గపు యుద్ధాలు చేసి, మార్కెట్లపై పెత్తనం కొనసాగిస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. దేశభక్తితో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని దాసు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శివాజీ, చిట్టక్క,భారతి, ధనలక్ష్మి, నరసయ్య, నర్సింగ్ పల్లి గంగన్న,బండి పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.