17వ వార్డులో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం 17వ వార్డు నవ్యనగర్‌లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు, విజయనగరం జిల్లా పార్లమెంటు బీసీ అధికారి ప్రతినిధి మరియు టౌన్ క్లస్టర్ ఇంచార్జ్ మరిపి జగన్మోహన్రావు, రాజాం టౌన్ యూనిట్ ఇంచార్జ్ గాంధీ గోపి, సీనియర్ మహిళా నాయకురాలు మెంటాడా పద్మశ్రీ, అల్లు మాధవి లత, అల్లు వెంకట నాయుడు, డి. భాస్కరరావు, మాధవరావు, వెంకట్రావు, రాణి, సుజాత, రవికుమార్, ఉమామహేశ్వరరావు, బోనంగి తిరుపతిరావు, అప్పలనాయుడు వెంకటేష్, మధు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ స్థాపకుల ఆశయాలను కొనసాగిస్తూ, పార్టీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.