ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్ల ఆటలు సాగనివ్వం.ఆళ్లగడ్డ సీఐ యుగంధర్ వార్నింగ్.
AIMA న్యూస్. నంద్యాల జిల్లా. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో ఆళ్లగడ్డ పట్టణ యువత క్రికెట్ బెట్టింగ్‌ల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పట్టణ సి.ఐ. యుగంధర్ ఆదివారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ నందు విలేకరులతో మాట్లాడుతూ క్రికెట్ అనేది ఒక వినోదం మాత్రమేనని, దానిని జూదంగా మార్చుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. బెట్టింగ్‌ల వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తి, అది నేర ప్రవృత్తికి దారితీస్తుందని ఎవరైనా ప్రత్యక్షంగా గానీ, సెల్‌ఫోన్ యాప్‌ల ద్వారా పరోక్షంగా గానీ బెట్టింగ్‌లకు పాల్పడితే వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని
ఒక్కసారి పోలీస్ రికార్డుల్లో పేరు నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు ఆటంకం కలుగుతుందని స్పష్టం చేశారు. పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లు, నిర్మానుష్య ప్రాంతాలు మరియు ఆన్‌లైన్ వేదికలపై ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామని అనుమానిత వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సెల్‌ఫోన్లలో ఎక్కువగా ఏం చూస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు నిరంతరం కన్నేసి ఉంచాలని, పిల్లలు అప్పుల పాలు కాకుండా చూసుకోవాలని సూచించారు.
పట్టణంలో ఎక్కడైనా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని సి.ఐ. యుగంధర్ తెలియజేశారు