logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నిడుముసలిలో విషాదం: పక్షవాతంతో వీఆర్ఏ మృతి – మానవత్వం చాటుకున్న టీడీపీ నేత దువ్వూరు మధుసూదన్ రెడ్డి

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని నిడుముసలి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)గా సుదీర్ఘకాలం సేవలందించిన సురపాక యోహాను శనివారం పక్షవాతంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. నిరుపేద కుటుంబానికి చెందిన యోహాను మరణంతో గ్రామస్తులు, రెవెన్యూ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై స్పందించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, తాను వ్యక్తిగత పనుల నిమిత్తం వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ, వెంటనే సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్ఫూర్తితో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు.
యోహాను అంత్యక్రియలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో, మధుసూదన్ రెడ్డి తన సొంత నిధుల నుండి రూ.5,000లను గ్రామస్తుల ద్వారా కుటుంబానికి అందజేశారు. తాను ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినా, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్థుల సమక్షంలో ఈ సాయం అందించబడింది.
ఒక ప్రభుత్వ ఉద్యోగిగా గ్రామానికి సేవలందించిన వ్యక్తి కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన సందేశం పంపారు. ఈ చర్యతో మధుసూదన్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారని స్థానికులు అభినందించారు.

0
0 views

Comment