కొండూరు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో, మాజీ మంత్రి మరియు వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు నేడు వారి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా స్వర్గీయ సుధాకర్ రెడ్డి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన మరణం స్థానిక రాజకీయ వర్గాల్లో తీరని లోటని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మవులూరు శ్రీనివాసులురెడ్డి, గొల్లపల్లి విజయకుమార్, బట్టేపాటి నరేంద్ర రెడ్డి, కొండూరు కృష్ణారెడ్డి, చిరమణ గోపాల్ రెడ్డి, పంబాల జనార్దన్ రెడ్డి, దండిగుంట ఫణి నాయుడు, సిగినం సుబ్రమణ్యం, శరత్ తదితరులు పాల్గొన్నారు