దుగ్గిశెట్టి కోటయ్య ఆశయాలను కొనసాగిస్తున్న మనమడు రామమూర్తి
కోవూరు తాలూకా ఆఫీస్ సెంటర్లోని దుగ్గిశెట్టి కోటయ్య వైశ్య సత్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రను ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాటసారులు సేదతీరేందుకు స్వర్గీయ దుగ్గిశెట్టి కోటయ్య గారు తన పేరుమీద ఈ సత్రాన్ని స్థాపించారని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ వంశపారంపర్య ట్రస్టీగా ఉన్న వారి మనమడు దుగ్గిశెట్టి రామమూర్తి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు.
ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు, పేద వైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం ద్వారా రామమూర్తి గారు సమాజ సేవలో ముందున్నారు అని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదే సమయంలో, ఈ ఏడాది వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో, దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సత్రం ట్రస్టీ దుగ్గిశెట్టి రామమూర్తి, సమాచార హక్కు సంఘం జిల్లా అధ్యక్షుడు టి. విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు కలికి సత్యనారాయణ రెడ్డి, బుదవరపు శివకుమార్, ఇంటూరి విజయ్, ఎస్కే మహ్మద్, గొర్రెపాటి నరసింహరావు, అగ్గి మురళి, తాళ్ళపాక లక్ష్మయ్య, ఎస్కే వహీద్, ఎస్కే ఖలీల్, పుల్లూరు మధన్, దువ్వూరు రంగారెడ్డి, కాకి భగవాన్, అజ్జిగంటి రావణయ్య తదితరులు పాల్గొన్నారు.