కుబీర్ వార సంత వేలం పాటలో దక్కించుకున్న షేక్ ఎజాజ్
నిర్మల్ జిల్లా స్థాయిలో వారసంతలో పేరేన్నికకన్న కుబీర్ గ్రామంలోని కూరగాయల మార్కెట్, వ్యాపార వాణిజ్య పరంగా ప్రతి గురువారం జరగబోయే వారసంతను ఈ రోజు కుబీర్ గ్రామంలోని గ్రామపంచాయతీలో వేలంపాట పాడగా అక్షరాల రెండు లక్షల యాబై ఒక వేల రూపాయలకు గ్రామంలోని (రూ. 251000) షేక్ ఎజాజ్ దక్కించుకాగా పంచాయతీ సెక్రెటరీ జాదవ్ మాధవ్, సర్పంచ్ కందూర్ బడా సాయినాథ్, SJWHRC తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ సాప పండరి, పాలకవర్గం, గ్రామస్తులు షేక్ ఎజాజ్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బంజా ప్రకాష్ ,వార్డు మెంబర్లు శ్రీమతి శ్రీ భాగ్యశ్రీ నాగేష్,గొరేకర్ లక్మి సురేష్ ముచ్చిండ్ల విఠల్, ఈసాఖాన్,గ్రామస్తులు గోరేకర్ సంతోష్,మేర సతీష్ , నారాయణ పటేల్,అబ్దుల్ వహీద్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.