సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తతో వ్యవహరించాలి.
దేశంలో ఎన్నో రకాల సైబర్ నేరాల పై పోరాడుతున్న పోలీసు వ్యవస్థ.
ఈవారం జిల్లాలో 14 సైబర్ క్రైమ్ ఫిర్యాదుల
పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చ్ 28 :-
సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తతో వ్యవహరించాలి.
దేశంలో ఎన్నో రకాల సైబర్ నేరాల పై పోరాడుతున్న పోలీసు వ్యవస్థ.
ఈవారం జిల్లాలో 14 సైబర్ క్రైమ్ ఫిర్యాదుల నమోదు
సైబర్ క్రైమ్ లో గోల్డెన్ హవర్ ముఖ్యమైనది
మోసపోయిన వెంటనే 1930 కి సంప్రదించాలి.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.
భారతదేశంలో సైబర్ నేరాలు ఎన్నో రకాలుగా ఉన్నాయని వాటిని అధిగమించాలంటే ప్రజలు ప్రతి ఒక్కరికి సైబర్ నేరాల పట్ల అవగాహన తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని శనివారం పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం ఆన్లైన్ ఆధారిత బ్యాంకు లావాదేవీలు కొనసాగుతున్న ఆధునిక భారతదేశంలో సైబర్ నేరాలు ఏపీకే ఫైల్స్, జాబ్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, ఈ కామర్స్ ఫ్రాడ్, కస్టమర్ కేర్ ఫ్రాడ్, స్టాక్ మార్కెటింగ్ ఫ్రాడ్ అంటూ ఎన్నో రకాలుగా ఉన్నట్లు తెలిపారు. వీటన్నింటి పట్ల ప్రజలు మోసపోయే అవకాశం ఉన్నందున ఒకవేళ ఇలాంటి వాటివి మీ జీవితంలో ఎదురైతే వాటిని నమ్మవద్దని తెలిపారు. ఒకవేళ ఎలాంటి సందర్భంలోనైనా మోసపోయినట్లయితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ వెబ్సైట్ నందు లేదా 1930 కు సంప్రదించి సహాయం పొందవచ్చుని తెలిపారు. సైబర్ క్రైమ్ జరిగిన ఘటనలో గోల్డెన్ హవర్ ముఖ్యమైనదని మోసపోయిన గ్రహించిన వెంటనే గంటలోపు ఫిర్యాదు చేసిన ఎడల ఆర్థిక నేరాలలో ఎక్కువ శాతం డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులను బురిడీ కొట్టించే సైబర్ని రకాలు వర్క్ ఫ్రం హోం అంటూ మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటి వల్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆన్లైన్ ఆధారిత సోషల్ మీడియా నందు ఈ కామర్స్ పేరుతో దుస్తులు నగలు వివిధ అంశాలలో ఎక్కువ శాతం ప్రజలకు, కొనుగోలు చేసిన వారికి నిరాశే ఎదురవుతుందని వాటి వల్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో లోన్ ఆప్ ద్వారా లోన్ తీసుకునే వారికి సైబర్ క్రైమ్ నేరగాళ్లు మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉన్న డబ్బులు సైతం తస్కరించుకుపోతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నందు ఎదురైన పలు సంఘటనలు పై వివరణ అందజేశారు.
🔹 ఇంస్టాగ్రామ్ నందు 500 కే లాప్టాప్ అంటూ మిగిలిన డబ్బులు ఇంటికి వచ్చిన తర్వాత ఇవ్వాలి అంటూ నకిలీ బిల్లులు చూపిస్తూ బాధితుని వద్దనుండి 2000 రూపాయలను మోసం చేశారు సైబర్ నేరగాళ్లు.
🔹 ఇన్స్టాగ్రామ్ నందు విలువైన బహుమతులు అందజేస్తామని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాధితుని వద్ద నుండి విడుదలవారీగా 60 వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు తస్కరించారు. తిరిగి వారికి ఎలాంటి బహుమతులు అందజేయలేదు.
🔹 తెలియని అప్లికేషన్లను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వారి ఫోన్ డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లి తిరిగి బెదిరించే అవకాశాలు, సందర్భాలు ఎదురయ్యాయి అని తెలిపారు.