🔸 అఖండ హరినామ సప్తలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
ప్రెస్ రిలీజ్
తేదీ:28-03-2026
నార్నూర్: నార్నూర్ మండలం ఖంపూర్ గ్రామంలో వారం రోజులుగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న అఖండ హరినామ సప్త కార్యక్రమానికి శనివారం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క హాజరయ్యారు. ముందుగా హనుమాన్ ఆలయంలో కార్యక్రమ నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం హరినామ సప్తలో పాల్గొని ప్రవచనాలు విన్నారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ..భగవంతుని నామస్మరణతో మనసుకు ప్రశాంతత లభిస్తుందని, సమాజంలో ఐక్యత,ధార్మిక చింతనలు పెరుగుతాయని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో సానుకూల వాతావరణాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడావి షేవంతాబాయి-భీర్ షావ్,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బానోత్ ప్రణిత,యూత్ కాంగ్రెస్ మండలం అధ్యక్షుడు షేక్ మహామ్మద్, మానే సంతోష్, బిర్జులాల్, మనుమంత్ రావ్,దశరత్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ కార్యాలయం, కుమురం భీం ఆసిఫాబాద్