logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అందుబాటులోకి భద్రగిరి మార్ట్* ...! -ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, -హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

*తెలంగాణ స్టేట్ *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**భద్రాచలం 28 మార్చ్2026*
(ఏఐఎంఎ మీడియా ప్రతినిధి)

*అందుబాటులోకి భద్రగిరి మార్ట్* ...!

-ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల,

-హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాచలం, మార్చి 28: (ఏఐఎంఏ మీడియా)స్థానికుల ప్రయోజనార్థం ఎంతో దూర దృష్టితో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఐఏఎస్ కృషి తో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శనివారం ఈ మార్టును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్ట్ లోని అటవీ ఉత్పత్తులను గవర్నర్ పరిశీలించారు. ప్రజా ఉపయోగకర అనేక అటవీ వస్తువులను ఈ మార్ట్ లో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని, ఇవి ప్రజలకు ఎంతగానో ఉపకరిస్తాయని ఇందుకు కృషి చేసిన ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ను కల్పించడంతోపాటు స్థానిక గిరిజన కుటుంబాలకు ఆర్థిక బలాన్ని అందించే సదాశయంతో ఏర్పాటు చేసిన ఈ మార్టును స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటికే ట్రైబల్ మ్యూజియం వంటి వినూత్న కార్యక్రమాలతో గుర్తింపు పొందిన పిఓ రాహుల్ భద్రగిరి మార్ట్ అందుబాటులోకి తేవడంతో మరో మైల్ రాయిగా నిలుస్తుందని, గిరిజనుల సాంప్రదాయ ఉత్పత్తులు, వారి ప్రతిభకు సరైన గుర్తింపు ఇవ్వడం, అలాగే వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ మార్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, భద్రాచలం ప్రజలు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి, గిరిజన ఎస్ హెచ్ జి గ్రూప్ మహిళలు, గిరిజన రైతులకు ఆర్థికంగా చేయూత అందించాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్,భద్రాచలం ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ మరియు ఐటీడీఏ యూనిట్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

66
2277 views

Comment