logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

105 మొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందజేత. వాటి విలువ దాదాపు 15.8 లక్షలు మొబైల్ ఫోన్ పోయిందా.. సీఈఐఆర్ లో ఫిర్యాదు చేయాలి.

పత్రిక ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 28 :-


జిల్లాలో ఒక సంవత్సరంలో 1100 మొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందజేత.

మొబైల్ ఫోన్లు తిరిగి రాబట్టడం కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు.

30 రోజుల వ్యవధిలో 105 మొబైల్ ఫోన్లు తిరిగి సంపాదించిన బృందం.

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి పొందిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేసిన బాధితులు

జిల్లా ఎస్పీకి ఎంతగానో కృతజ్ఞతలు, ధన్యవాదాలు.

రైతు బజార్, బస్టాండ్, రైల్వే స్టేషన్, రిమ్స్ ప్రదేశాలలో జాగ్రత్తలు పాటించాలి.

సెల్ఫోన్ దొంగలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

మొబైల్ ఫోన్ లేనిదే ఎలాంటి పని జరగని ఈ అధినాతన సమాజంలో మనకు అత్యంత విలువైనది, తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే సాంకేతిక పరికరం మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్లో అన్ని వివరాలు, అన్ని జ్ఞాపకాలు, అన్ని లావాదేవీలకు సంబంధించిన అప్లికేషన్లు ఉంటాయి, సాధారణంగా ప్రజలు మొబైల్ ఫోన్లు పోగొట్టుకోవడం, దొంగలించబడటం జరుగుతుంది. పోగొట్టుకున్న వాటిని పొందాలంటే, బాధితులు వెంటనే https://www.ceir.gov.in అనే వెబ్సైట్ లో లేదా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా నందు ఇలా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి సంపాదించడం కోసం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ప్రత్యేకంగా రికవరీ బృందాన్ని ఏర్పాటు చేశారని, ఇలా జిల్లా ఎస్పీ ఆదేశాలతో వీరు గత 30 రోజుల వ్యవధిలో దాదాపు వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి బాధితులు పోగొట్టుకున్నటువంటి, దొంగలించబడినటువంటి 105 మొబైల్ ఫోన్ లను తిరిగి రాబట్టడం జరిగింది. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుండి ఇప్పటివరకు ఒక సంవత్సర కాలంలో 1100 మొబైల్ ఫోన్లను తిరిగి రాబట్టడం జరిగింది. ఇలా ఇంత మొత్తంలో రాబట్టడం జిల్లా చరిత్రలోనే ప్రథమం, మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు దాదాపు మధ్యతరగతి కుటుంబీకులు, బీదవారు వారు ఎంతగానో కష్టపడి కొనుక్కున్న మొబైల్ ఫోన్ను తిరిగి వారికి అందజేయాలని సదుద్దేశంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఈ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ దొంగతనాలు జరిగే ప్రాంతాలు రైతు బజార్, రిమ్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్, ఇళ్లలో దొంగతనాలు, బంధువులకు ఫోన్ చేస్తానంటూ ఫోన్ తస్కరించడం లాంటివి జరుగుతున్నాయని వాటి వల్ల అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మొబైల్ ఫోన్లను తిరిగి ఇచ్చే క్రమంలో శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశం మందిరంలో ఆదిలాబాద్ జిల్లాలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న, చోరీకి గురైనటువంటి బాధితులకు 105 మొబైల్ ఫోన్లు (దాదాపు 15.8 లక్షల విలువ చేసే ) వివిధ ప్రాంతాల నుండి తెప్పించి బాధితులకు తిరిగి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి అందుకున్న బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ, జిల్లా ఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రతి నెల రోజుల లో పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్లను తిరిగి రాబట్టి బాధితులకు అందజేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. బాధితులు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే దగ్గర్లో ఉన్న సంబంధిత పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని తెలిపారు. మొబైల్ ఫోన్ దుకాణాల యజమానులు, రిపేరింగ్ దుకాణాల యజమానులు, మొబైల్ ఫోను కొనే ముందు మొబైల్ ఫోన్ యజమాని అనుమతి సరైన పత్రాలు తీసుకోవాలి, దొంగ మొబైల్ ఫోన్లు కొన్న ఎడల వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా రాబట్టిన మొబైల్ ఫోన్లు ఉత్తర భారతదేశంలో ఉండటం వాటిని ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో తిరిగి రాబట్టడం జరిగిందని తెలిపారు. మొబైల్ దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగిందని. దొంగలించిన పడిన మొబైల్ ఫోన్ల కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ డి.ఎస్.పి ఎల్ జీవన్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ప్రత్యేక బృందం సభ్యులు ఆర్ఎస్ఐ పి గోపి కృష్ణ, ఎం ఎ రియాస్, మజీద్, త్రిశూల్, అన్వేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

1
201 views

Comment