logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Today Chairperson Medam Water Workers Attendance Visit at Municipal Water Tank at 8.10 AM

మున్సిపల్ సానిటేషన్, వాటర్ సప్లై సిబ్బంది అటెండెన్స్ మరియు హాజరు పట్టికలను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష.శనివారం ఉదయం 5 గంటలకు స్వయంగా వచ్చి సానిటేషన్ వర్కర్ల హాజరు పట్టికను పరిశీలించారు. దీంతోపాటే వాటర్ సెక్షన్ లో కూడా హాజరు పట్టికను పరిశీలించి రెగ్యులర్గా విధులకు హాజరుకావాలని సూచించారు. ఎంతమంది విధుల్లో ఉన్నారు ఎంతమంది సెలవుల్లో ఉన్నారు అనే వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనుష సతీష్ మాట్లాడుతూ... పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సానిటేషన్ కార్మికుల పాత్ర ఎంతో ఉందన్నారు. వీరితో పాటే వాటర్ సప్లై సిబ్బందిది కూడా అంతే పాత్ర ఉంటుందన్నారు. ఈ కార్మికుల కోసం ప్రతి నెల వేతనాల రూపంలో 78 లక్షల రూపాయలను చెల్లించడం జరుగుతుందన్నారు. అయితే కొందరు మట్టుకు కార్మికులు విధులకు గైర్హాజరు జరుగుతున్నట్లు తన పరిశీలనలో తెలిసిందన్నారు. గతంలో ఎవరు పట్టించుకోని కారణంగా కొందరు ఇష్టారితిన కార్మికులు విధులకు హాజరయ్యే వారన్నారు.అవసరం లేని వారిని వేరేవాటికి సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వేసవికాలం ప్రారంభమైనందున ప్రజలు నీటిని వృధా చేయకుండా మితంగా వాడుకోవాలని మీకు ఎంత వాటర్ కావాలన్నా అంతా పట్టుకొని తర్వాత ట్యాబ్ బిగించుకోవాలని తద్వారా వేరే వారికి నీరు కింద వస్తున్నందున టాప్ తప్పనిసరిగా బిగించుకోవాలని నీటిని వృధా చేయకూడదని తెలపడం జరిగింది.వీలైనంత త్వర త్వరగా శాలరీలు , పిఎఫ్ డబ్బులను వెంటవెంటనే వారి వారి అకౌంట్లో జమ చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది.శానిటేషన్ కార్మికులకు సంబంధించిన సబ్బులు , డిటర్జెంట్లు , నూనెలు, గ్లౌజులు , ఆఫ్రాన్లను అతి త్వరలో కౌన్సిల్ తీర్మానం తీసుకొని అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.కార్మికులకు ఎక్కడ సమస్య ఉన్న నేరుగా సంప్రదించాలని తెలపడం జరిగింది.కార్మికులకు , ప్రజలకు , అధికారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేయడం జరిగింది.

2
436 views

Comment