లాక్ డౌన్ ప్రసక్తే లేదు?
*లాక్ డౌన్ ప్రసక్తే లేదు?*
హైదరాబాద్:మార్చి 28
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. దేశంలో ఇంధన కొరత ఏర్పడవచ్చ నే ఆందోళనల నడుమ, ప్రజలను గందరగోళానికి గురిచేసే ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
*లాక్‌డౌన్ ప్రతిపాదనే లేదు..! ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!*
ఇంధన సరఫరాలో అంత రాయం ఏర్పడుతుందన్న భయంతో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితులపై ఆర్థిక మంత్రి సీతారామన్ రాజ్యసభలో ఆర్థిక బిల్లు 2026 పై చర్చకు సమాధానం ఇస్తూ... అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న మాట నిజమే. ఎనర్జీసప్లై చైన్, నిత్యావసరాల రవాణాను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలం గా ఉన్నాయి. లాక్‌డౌన్ విధించే ఆలోచన గానీ అలాంటి ప్రతిపాదన గానీ ప్రభుత్వం వద్ద లేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు సమాజానికి హాని కలిగిస్తాయి అని ఆమె అన్నారు.
గత నెల రోజుల్లో అంతర్జా తీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి ఏకంగా 122 డాలర్లకు చేరింది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు 20 నుంచి 50 శాతం మేర పెరిగాయి. అయితే భారత్‌లో సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని కేంద్ర ఆర్థిక ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వివరించారు.
పెట్రోల్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని రూ.13 నుంచి రూ.3కు తగ్గించడమే కాకుండా.. డీజిల్‌పై ఉన్న రూ.10 సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ.. చమురు కంపెనీలకు, ప్రజలకు భారీ ఊరట లభించనుంది.