ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వరార్చన కార్యక్రమం.........
ది 27- 03 -2026. ఈరోజు సాయంత్రం ఉడా ట్రేడ్ సెంటర్ లో గల, శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానము నందు *స్వరార్చన* కార్యక్రమం
పాలకమండలి సహకారంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆలయ ముఖ్య సలహాదారు బ్రహ్మశ్రీ శ్రీ కన్నేపల్లి శివరామ చంద్రమూర్తి గురువుగారు జ్యోతి ప్రజ్వలన చేసి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే మ్యూజిక్ అకాడమీ నిర్వాహకురాలు శ్రీమతి వెంపటి శ్రీవిద్య గోపాలకృష్ణ గారి శిష్య బృందం చే, భగవద్గీత శ్లోకాలు,చక్కని శ్రీరామ నామ సంకీర్తనలు ఆలపించారు. వీరంతా కూడా 10, 12 సంవత్సరాల చిన్నారులే. ఈ సందర్భంగా తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాల వల్ల ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడమే కాక, తెలుగు హిందీ భాషలపై స్వచ్ఛమైన ఉచ్చారణ ప్రాభవం కలుగుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికత పెరుగుతుంది. దీనిలో ప్రావీణ్యం సాధించగలిగితే ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని తెలియజేశారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను సంగీత కార్యక్రమాలు అభ్యసించే విధంగా తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, పిల్లల తల్లిదండ్రులు, అధిక సంఖ్యలో భక్తులు, మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, జివి రావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, సాయికృష్ణ యాదవ్, శ్రీమతి కీర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం తీర్థప్రసాద వితరణ జరిగింది.