శ్రీరామనవమి ర్యాలీ కి పటిష్ట బందోబస్తు ఏర్పాటు
*పత్రికా ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా,
మార్చ్ 27 :-
**
*డ్రోన్, సీసీటీవీ కెమెరాల తో పర్యవేక్షణ.*
*బందోబస్తులో పాల్గొననున్న 300 మంది సిబ్బంది*
*పట్టణంలోని ప్రధాన కూడళ్ళకుండా కొనసాగనున్న ర్యాలీ.*
*సిబ్బందికి సూచనలు ఇచ్చిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్*
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించబడనున్న ర్యాలీకి జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. స్థానిక టీఎన్జీవో గార్డెన్ నందు ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన కూడళ్ళు, ముఖ్య మార్గాల వెంట ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయబడింది. ర్యాలీ సజావుగా, శాంతియుతంగా కొనసాగేందుకు సుమారు 300 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు అని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలుగా డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ నిర్వహించబడుతుంది అని అన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే ర్యాలీలో పాల్గొనే భక్తులు, నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
పోలీసు శాఖ తరఫున ప్రజల భద్రతకు అన్ని విధాల చర్యలు తీసుకున్నామని, ప్రజలు నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. డ్రోన్ కెమెరా సిసి కెమెరా ద్వారా జిల్లా ఎస్పీ ర్యాలీ ప్రశాంతంగా కొనసాగేలా ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బి సురేందర్రావు, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్ర వర్ధన్, సిఐలు ఎస్ఐలు ఆర్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు