జొన్నవాడలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం – ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొనడం
బుచ్చిరెడ్డిపాలెం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలోని శ్రీ వరదరాజుల స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.
ఈ వేడుకల్లో మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా తన చేతులమీదుగా అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వాసుపల్లి శ్రీనివాసులు రెడ్డి, మాజీ సర్పంచ్ పిల్లెళ్ల మురళి, ఎంపీటీసీ నాటారు బాలకృష్ణ, దేవస్థానం మాజీ చైర్మన్ పిల్లెళ్ల ప్రేమ్ సాగర్, ముంగర శివకుమార్, కందికట్టు చిన్న రమణయ్య, రాగాల ప్రసాద్, కందికట్టు మల్లికార్జున, పుట్టా మల్లికార్జున పాల్గొన్నారు. అలాగే కళ్యాణ ఉభయకర్తలు సింగిరి మధు, సింగిరి రాము మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
మరియు వైసీపీ నాయకులు చెర్లో సతీష్ రెడ్డి, షేక్ షాహుల్, కలువ బాలశంకర్ రెడ్డి, తాళ్ల వెంకటేశ్వర్లు, గుమ్మ రఘురామయ్య, గుమ్మ భాస్కర్, కోరికల చంద్రశేఖర్, మాలాద్రి తదితరులు పాల్గొన్నారు