logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శిల్పకళా వేదికలో హల్చల్ చేసిన ఆళ్లగడ్డ కుర్రాడు. మా భాష

AIMA న్యూస్ నంద్యాల జిల్లా. మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు నిన్న రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అత్యంత కోలాహలంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన మెగా అభిమానుల మధ్య, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామానికి చెందిన మన ఆళ్లగడ్డ యూట్యూబ్ ఛానల్ యువకుడు మా భాష తన టీమ్‌తో కలిసి ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆళ్లగడ్డ కుర్రాళ్ళు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా మా భాష మెగా హీరోపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ వేడుకల్లో చురుగ్గా పాల్గొని స్టేజ్ పై డ్యాన్స్ తో అదరగొట్టాడు. దీంతో తోటి అభిమానులు హర్షం వ్యక్తం చేశారరు ఈ సందర్భంగా భాషా మాట్లాడుతూ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో, అది కూడా శిల్పకళా వేదిక లాంటి పెద్ద వేదికపై పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ఆళ్లగడ్డ నుంచి వెళ్లి ఇక్కడ మా అభిమానాన్ని చాటుకోవడం ఒక మధుర జ్ఞాపకం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

73
2039 views

Comment