ఘనంగా సీతారాముల కళ్యాణం
వరంగల్,,మార్చి 27, నిఘా న్యూస్
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్మన్ చెన్నూరి కిరణ్ రెడ్డి భారీగా ఏర్పాట్లు చేశారు అలాగే గ్రామ సర్పంచ్ పెండ్యాల రాజు భోజనాలు ఏర్పాటు చేయించారు అంగరంగ వైభవంగా పెళ్లి సంతు పూజించింది అలాగే పెళ్లి సందర్భంగా వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు భోజనాలు ఏర్పాటు చేసి లడ్డు ప్రసాదాలు పంపిణీ చేశారు సీతారాముల కళ్యాణం సందర్భంగా నర రమణారెడ్డి రాముడిని అలాగే మామిడాల మురళి అమ్మవారిని తయారుచేసి ఊరేగింపుగా టెంపుల్ వద్దకు తీసుకువచ్చారు దీంతో ఎదురుకోలు అనంతరం పెళ్లి ఘనంగా నిర్వహించారు