logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నర్సీపట్నంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలుభక్తిపారవశ్యంలో మునిగితేలిన భక్తజనం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సీపట్నంలోని రామాలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం పట్టణం శ్రీరామ నామ స్మరణతో మారుమోగింది.ముఖ్యంగా గవర వీధిలోని శ్రీశ్రీశ్రీ కోదండ సీతారామాలయంలో నిర్వహించిన కళ్యాణోత్సవాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అర్చకులు మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని భక్తి చాటుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నూతన దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పల్లెపూలు సమర్పించి స్వామివారిని సేవించారు.అనంతరం భారీ అన్నసమర్పణలో వేలాది మంది తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఉత్సవాల దిగ్విజయంలో ఆలయ కమిటీ సభ్యులు కాళ్ళ సుబ్బారావు, మల్ల గణేష్, పిల్లా వెంకటేశ్వరరావు, పొలమరశెట్టి రాజా, ఆడారి లోవ రామేశ్వరరావు, మల్ల రవి, శిలపరశెట్టి శ్రీనివాస్, బీశెట్టి సత్యనారాయణ, బొడ్డేటి శ్రీను, కాళ్ళ జానకిరామ్ మొదలైనవారు పాల్గొన్నారు

3
262 views

Comment