logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సోనియా గాంధీ ఆరోగ్యంపై హుటాహుటిన గంగారాం ఆసుపత్రికి చేరుకున్న PPN.

రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఆరోగ్యంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఆమెకు, శరీరంలో వ్యవస్థాగత ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించడంతో వెంటనే ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, అంతర్గత ఇన్ఫెక్షన్ కోసం ఆంటిబయాటిక్స్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్య బృందం తెలిపింది.సోనియా పక్కనే కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఉండి వారి ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా చూస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉండి వైద్యులతో మాట్లాడుతూ సమాచారం తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో న్యూ ఢిల్లీ రాజేంద్రనగర్‌కు చెందిన సామాజిక–రాజకీయ కార్యకర్త, అఖిల భారత ఓ బి సి(జ్యోతిరావు పూలే) అధ్యక్షుడు శ్రీ పోతల ప్రసాద్ నాయుడు హుటాహుటిన గంగారాం ఆసుపత్రికి చేరుకుని సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిని విచారించారు. సోషల్ మీడియాలో విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకుని, ఆమె కుటుంబానికి, ధైర్యాన్ని అందించారు. ఆయన సామాజిక సేవల్లో ఎప్పుడూ ముందుంటారు. ఈసారి కూడా సోనియా ఆరోగ్యం గురించి వచ్చిన వార్త చదివిన వెంటనే హుటాహుటిన గంగారాం ఆసుపత్రికి చేరుకుని, ఆమె కోసం ప్రజలు ప్రార్థిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆసుపత్రి వర్గాలు ఆమె పరిస్థితి క్రమంగా మెరుగవుతుందని, పూర్తిగా నయమైన తర్వాత ఇంటికి తరలించే అవకాశం ఉందని చెబుతున్నాయి.

5
402 views

Comment