శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, పలువురు
*ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు పొంగులేటి ,తుమ్మల తదితరుల
తెలంగాణ స్టేట్**భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **భద్రాచలం పట్టణం **(మార్చి 27) ఏఐఎంఏ మీడియా ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు పశుసంవర్ధక మరియు యువజనుల శాఖ మంత్రి వాకాటి శ్రీహరి సారపాక లోని బిపిఎల్ హెలిపాడ్ లో 10:42 గంటలకు విచ్చేశారు. రాజ్యసభ సభ్యుడు ప్రేమ్ నరేందర్ రెడ్డి తో పాటు తెలంగాణ రాష్ట్రం మంత్రి రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ తుమ్మల నాగేశ్వరరావు , మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు ఆయనను ఘనంగా స్వాగతం పలికారు.10:50 నిమిషాలకు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మండపానికి బయలుదేరారు.