కామారెడ్డి జిల్లా
నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగు నీటి విడుదల
కామారెడ్డి జిల్లా
తేదీ: 27.03.2026.
నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగునీటి అవసరాల కోసం ప్రధాన కాలువ ద్వారా 5వ విడతలో భాగంగా, 1200 క్యూసెక్స్ నీటిని ఈ రోజు మధ్యాహ్నం 3:00 గంటలకి విడుదల చేయడం జరుగుతుంది.
కాలువల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు, రైతులు, పశుపాలకులు అప్రమత్తంగా ఉండాలని, కాలువలోకి లేదా కాలువ ఒడ్డుల సమీపానికి వెళ్లవద్దని సూచించడమైనది.
ప్రజల భద్రత దృష్ట్యా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని
నీటిపారుదల శాఖ నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.