జిల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు*
స్థానిక హౌసింగ్
*రామాలయంలో జిల్లా ఎస్పీ పూజా కార్యక్రమాలు*
* బోర్డ్ లోని శ్రీ రామాలయం నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఈరోజు శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తిశ్రద్ధలతో శ్రీరామచంద్ర పట్టాభిషేకము, కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలు శాంతి భద్రతలను కాపాడుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్య దేవాలయాల వద్ద, ర్యాలీ ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.