ఆళ్లగడ్డలో ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు.
AIMA న్యూస్. మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు శుక్రవారం రోజున నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రతాప్ థియేటర్ నందు అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ మరియు, నియోజకవర్గ జనసేన పార్టీ రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు మాబు హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు భారీగా పాల్గొని కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జాకీర్ మాట్లాడుతూ రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో ఆయన గ్లోబల్ స్టార్‌గా ఎదిగి తెలుగు వారికి గర్వకారణంగా నిలిచారు. కేవలం వెండితెరపైనే కాకుండా, నిజజీవితంలోనూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని నిరుపేద పిల్లలకు స్వీట్లు, పండ్ల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.