వెన్నెలపాలెంలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు
అనకాపల్లి జిల్లా, నాతవరం మండలం, వెన్నెలపాలెం: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెన్నెలపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించిన సీతారామ కల్యాణ మహోత్సవంలో డాక్టర్ లాలం సత్యనారాయణ, గంగారత్నం దంపతులు పాల్గొన్నారు. హైందవ సాంప్రదాయాల ప్రకారం వైభవంగా జరిగిన ఈ కల్యాణ వేడుకలు గ్రామవాసులను భక్తి సముద్రంలో ముంచెత్తాయి.స్వామివారిని భక్తిభావంతో దర్శించుకున్న దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి చేతుల మీదుగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. మంత్రోచ్చారణలు, ఘంటల ధ్వనులు, దీపారాధనల మధ్య ఈ దైవిక కల్యాణం ఆకట్టుకున్నది. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు.ఈ ఉత్సవంలో గ్రామ పెద్దలు, శ్రీ సీతారామ హరి భజన మండలి సభ్యులు, ఆలయ ధర్మకర్తలు లాలం వెంకట చిన్న గణేష్, లాలం శ్రీను ప్రముఖులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా మార్కెట్ యార్డ్ సెల్ కన్వీనర్ గొంప సత్యనారాయణ, పోలిపర్తి రమేష్ నాయుడు, రెడ్డి రాంబాబు, నందిపల్లి సింహాచలం, పోలిపర్తి నాయుడు తదితరులు హాజరయ్యారు. యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని, భజనలు, కీర్తనలతో వాతావరణాన్ని ముంచెత్తారు.రామరాజ్య స్ఫూర్తితో కలిసిన ఈ ఉత్సవం గ్రామంలో ఐక్యత, భక్తి భావాలను పెంపొందించింది.