logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో అవయవ దానంపై అవగాహన.

పాణ్యం (AIMA MEDIA): స్థానిక శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అవయవ దానం పై అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సుబ్రహ్మణ్యం తెలిపారు. అవయవ దానం ప్రాణాలను రక్షించే మహోన్నత సేవ అని సమాజంలో అవయవ దానంపై అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా విచ్చేసిన శాంతిరాం మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ డా. ఎం జానకి మాట్లాడుతూ అవయవ దానం ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, మరియు ఒక దాత అనేక మంది జీవితాలను ఎలా కాపాడగలడో వివరించారు. జీవించి ఉన్నప్పుడు కూడా, మరణానంతరం కూడా అవయవ దానం చేయవచ్చని వారు తెలిపారు. అవయవ దానం గురించి ఉన్న అపోహలను తొలగించడం, స్వచ్ఛందంగా దానం చేయడానికి ప్రజలను ప్రోత్సహించడం, మరియు అవయవ దానం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి నాగరాజు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

0
0 views

Comment