బీసీ భవన స్థల సేకరణ కొరకు జాయింట్ కలెక్టర్ ను కలిసిన బీసీ నాయకులు.
నంద్యాల (AIMA MEDIA ): నంద్యాల పట్టణం నందు నూతన బీసీ సంఘం స్థల సేకరణ, బీసీ భవనం కొరకు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర బీసీ జాతీయ సంఘం నాయకులు కుమ్మరి ప్రసాదు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలలో బీసీ భవనాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలాగే నంద్యాల నూతన జిల్లాలో కూడా బీసీ భవనానికి స్థలాన్ని సేకరణ చేసి ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ను ఆయన కోరారు.జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ స్థల సేకరణ కొరకు ఎమ్మార్వోకి ఫోన్ చేసి తెలియజేశారు.త్వరితగతిన బీసీ నాయకులకు స్థల సేకరణ చేయవలసిందిగా జాయింట్ కలెక్టర్ నంద్యాల ఎమ్మార్వోకి చెప్పారు.ఈ కార్యక్రమంలో వాల్మిక సంఘం రాష్ట్ర నాయకులు పులికొండ కొండన్న, బీసీ నాయకులు రాము, వెనకబడిన తరగతుల జిల్లా అధికారులు జగ్గయ్య, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.