కొత్తూరు సుబ్బరాయుని హుండీ ఆదాయం 12.38 లక్షలు.
పాణ్యం (AIMA MEDIA): ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు నంద్యాల డివిజన్ దేవాదాయశాఖ తనిఖీ అధికారి పి.హరిచంద్రారెడ్డి పర్యవేక్షణలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ లెక్కింపు వల్ల 12 లక్షల 38వేల 825 రూపాయలు నగదు, 523 గ్రాముల వెండి ఆదాయంగా వచ్చినట్లు ఆలయ ఈవో యం.రామక్రిష్ణ తెలిపారు. ఈ లెక్కింపు గత ఫిబ్రవరి 5వ తేదీ నుండి మార్చి 26వతేది వరకు ఈ ఆదాయం సమకూరినదని ఆలయ ఈవో యం.రామక్రిష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, బీరం శివరామిరెడ్డి, అర్చకులు నారాయణస్వామి, సురేష్ శర్మ, బ్యాంక్ అధికారులు, ఏఎస్ఐ రఫీ, పిసి వెంకటేశ్వరరావు, బాలాజీ సేవా సంస్థ, తిరుమల బాలాజీ సేవా సంస్థ అధ్యక్షులు శివయ్య, సీతారామిరెడ్డి సంస్థల సభ్యులు, ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.