logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నెల్లూరు రూరల్‌లో అభివృద్ధి జాతర – కోటంరెడ్డి సోదరుల సేవలకు ప్రజల మద్దతు

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ప్రజాసేవనే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న కోటంరెడ్డి సోదరులు ప్రాంత అభివృద్ధికి కొత్త దిశను చూపుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కోటంరెడ్డి గిరిధర్ గారిని ఎమ్మెల్యేగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మంత్రిగా చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

హ్యాట్రిక్ విజయంతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని నాయకులు తెలిపారు.

నెల్లూరు రూరల్ అభివృద్ధి జాతరలో భాగంగా కల్లూరుపల్లి వద్ద సుమారు రూ.1.4 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు కోటంరెడ్డి గిరిధర్ గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల మాట్లాడుతూ, “శ్రీధర్ అన్న ముందుంటే, గిరిధర్ గారు తోడుంటే అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదు. నెల్లూరు రూరల్‌లో సమస్యలను వెతికితే, పరిష్కారాలతో ముందుకొస్తున్న నాయకత్వం కోటంరెడ్డి సోదరులదే” అని అన్నారు.

అదే విధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న కూటమి ధర్మాన్ని స్థానిక స్థాయిలో కూడా సమన్వయంతో కొనసాగిస్తూ, జనసేన–బీజేపీ పార్టీలను కలుపుకుని ముందుకు సాగడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇది ప్రజల అభివృద్ధి కోసం రాజకీయాలు ఎలా కలిసి పనిచేయాలన్న దానికి మంచి ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు.

ఈరోజు ప్రారంభమైనవి కేవలం అభివృద్ధి పనులు మాత్రమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక గొప్ప ప్రస్థానమని కిషోర్ గునుకుల వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ తరఫున కోటంరెడ్డి సోదరుల స్ఫూర్తితో ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ గారు, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు, తెలుగుదేశం, జనసేన పార్టీల సీనియర్ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, బిల్లా ఉదయ్ కిరణ్, దార్ల నాగేంద్ర, బాలు, ప్రతాప్, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

0
12 views

Comment