logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మహిళా ఆపద్బాంధవురాలు "పోలీస్ అక్క"*

*పత్రికా ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా,
మార్చ్ 26 :-

*
*ప్రజలలో విశేష ఆదరణ పొందుతున్న పోలీసు అక్క కార్యక్రమం.*

*బాలికలు స్వయంగా చేస్తున్న ఫిర్యాదులు*

*ఈ సంవత్సరం 17 బాల్యవివాహాలు నిలిపివేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అక్క సిబ్బంది.*

*నెల రోజుల వ్యవధిలో 131 అవగాహన కార్యక్రమాలు, 60 గ్రామాలను సందర్శించిన పోలీస్ అక్క సిబ్బంది*

*నెల రోజులలో 25 ఫిర్యాదుల స్వీకరణ.*

*పోలీస్ అక్క సిబ్బందితో సమావేశం.*

*ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంస పత్రాలతో అభినందన.*

*అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.*

ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు చిన్నారుల రక్షణకై ప్రారంభించబడిన పోలీసు అక్క అనే కార్యక్రమానికి విశేష ఆదరణ లభించడం జరుగుతుంది. ఈరోజు పోలీసు ముఖ్య కార్యాలయం నందు పోలీసు అక్క సిబ్బందిచే ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొదటగా జిల్లావ్యాప్తంగా ప్రజలచే విశేష ఆదరణ పొందుతున్న "పోలీస్ అక్క" సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. బాల్య వివాహాలు నిలిపివేయడంలో, మహిళలపై జరుగు నేరాలు ఆపడంలో, ఆకతాయిల వేధింపులు నిరోధించడంలో బాలికలు ముందుంటూ పోలీసు అక్క కు ఫిర్యాదు చేయడంతో షీ టీం బృంద సభ్యుల సహాయం చెత సమస్యల పరిష్కారాలకు కృషి చేయడం జరుగుతుంది. వేధింపులు గురైన సమయంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటూ మహిళలకు అండగా ఉంటుంది "పోలీసు అక్క". ఈ నెల రోజుల వ్యవధిలో షీ టీం బృంద సభ్యులచే మరియు పోలీసు ఆక్క అనే కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా 45 ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు జిల్లా పోలీసు వ్యవస్థ ఎలాంటి కష్ట సమయంలోనైనా అత్యవసర సమయంలోనైనా అందుబాటులో ఉంటూ, ఆపద్బాంధవుడిగా వ్యవహరిస్తూ సేవలందిస్తుందని తెలిపారు. చిన్నారులు తమ సొంత కుటుంబ సభ్యులతో ఉండే విధంగా పోలీసు అక్క సిబ్బందికి పాఠశాలల్లో కళాశాలల్లో జరిగే ప్రతి విషయాలను పంచుకోవాలని తెలిపారు. పాఠశాల లో, కళాశాలలో, రోడ్లపై, ఇతర ప్రదేశాలలో ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే డయల్ హండ్రెడ్ లేదా ఆదిలాబాద్ షీ టీం 8712659953 నెంబర్ ద్వారా సంప్రదించి, సహాయం పొందవచ్చును తెలిపారు. నెల రోజుల వ్యవధిలో పోలీస్ అక్క సిబ్బంది 60 గ్రామాలను సందర్శించి 131 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో దాదాపు 25 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఆకతాయి వేధింపుల కారణంగా పదిమంది కి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించడం జరిగిందని. అదేవిధంగా పలువురి పై ఈ పెట్టి కేసులు ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేయడం జరిగిందని. స్వయంగా చిన్నారులు, విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో ఇప్పటివరకు 17 బాల్యవివాహాలను నిలిపివేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెలరోజుల వ్యవధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో విమెన్ పి ఎస్ ఇన్స్పెక్టర్ బిడి ప్రేమ్ కుమార్, షీ టీం బృందం ఏఎస్ఐ సుశీల, హెడ్ కానిస్టేబుల్ వాణిశ్రీ, పోలీస్ అక్క సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment