logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పత్రికా ప్రకటన మార్చి 26, 2026_ఆదిలాబాదు:


ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరగనున్న పదవతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, టాస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నుండి 27 వరకు పదవ తరగతి, ఏప్రిల్ 28 నుండి మే 5 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని, పరీక్షా సమయాలు ఉదయం 9:00 నుండి 12:00 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు ఉంటాయని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో 4 పదవతరగతి, 3 ఇంటర్మీడియట్‌కు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీటీవీ కెమెరాల నిఘా ఉండాలని, తాగునీరు, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా పత్రాల రవాణా, భద్రత కోసం పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని, విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం 7 గంటల నుండే ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు.

అదే విధంగా మార్చి 29 ఆదివారం రోజు జరగనున్న 'ఉల్లాస్' అక్షరాస్యత పరీక్షపై కలెక్టర్ సమీక్షిస్తూ,. జిల్లాలో సుమారు 20,000 మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరవుతున్నారని, వారందరూ ఉత్తీర్ణులయ్యేలా చూడాలని లెర్నింగ్ సెంటర్ల నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. వారందరికీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా చూడాలని, బేస్‌లైన్ టెస్టులకు హాజరుకాని వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలనీ ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వర్, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి గణేష్ జాదవ్, డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్లు అశోక్, సుజాత్ ఖాన్, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు శైలజా, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

1
80 views

Comment