బాటిళ్లలో పెట్రోల్ కొట్టిస్తే జైలు శిక్ష
జర్నలిస్ట్: ఆకుల గణేష్
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల గ్రామంలో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కొరత భయంతో ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. అయితే, పెట్రోలియం చట్టం-1934 ప్రకారం క్యాన్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో ఇంధనం నిల్వ చేయడం నేరం. మొదటిసారి పట్టుబడితే వెయ్యి రూపాయల జరిమానా లేదా నెల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే 5 వేల రూపాయల జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాటిళ్లలో పెట్రోల్ తీసుకెళ్లవద్దని హెచ్చరించారు.