వంటగ్యాస్ సిలిండర్ పై అసత్య ప్రసారాన్ని నమ్మవద్దు:
విజయనగరం పార్లమెంటరీ జిల్లా సీనియర్ నాయకులు మిత్తిరెడ్డి మధుసూదన్ రావు
విజయనగరం జిల్లా. రాజాం.
భారతీయ జనతా పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా సీనియర్ నాయకులు మిత్తిరెడ్డి మధుసూదనరావు నేడు ఒక ప్రకటనలో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఎల్పీజీ సిలిండర్లు కొరత అంటూ సోషల్ మీడియా మాధ్యమాలలో వస్తున్న అసత్య వార్తలను ఖండించారు, అటువంటి అసత్య వార్తలను నమ్మవద్దని, అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని, అనవసరంగా లేదా భయాందోళనలతో ఎల్పిజి రీఫిలింగ్ బుకింగ్ చేయవద్దని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు, కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వినియోగదారులకు వివరణ ఇవ్వడం జరిగిందన్నారు, గృహ అవసరాలకు వినియోగించి 14.2 కేజీ ల ఎల్పిజి సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్టరీత్యా నేరమన్నారు, డిమాండుకు తగ్గట్టుగా దేశంలో సహజ వాయువు నిల్వాలను పుష్కలంగా ఉన్నాయని పెట్రోలియం సహజవాయు మంత్రి శాఖ తెలియజేసిందన్నారు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు ఎల్పిజి
రీఫిలింగ్ కాల పరిమితులు యధాతధంగా కొనసాగుతాయన్నారు , ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహజవాయువులు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి లక్ష్యంగా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ బయో గ్యాస్ ను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు దీని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు తాము నివసిస్తున్న చోట ఖాళీ స్థలాల్లో సబ్సిడీతో కూడిన బయోగ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేసుకొని స్వయం సమృద్ధి సాధించాలన్నారు,