శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా
విజయనగరం జిల్లా. రాజాం:
స్థానిక శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తుగా శ్రీరామనవమి పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించగా, విద్యార్థులు భక్తి భావంతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఏ. రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై, శ్రీరాముడి ఆదర్శాలను విద్యార్థులు ఆచరణలో పెట్టాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ గట్టు పాపారావు, డైరెక్టర్ గట్టు పద్మావతి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
ఈ వేడుకల్లో విద్యార్థులు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని పూజలు నిర్వహించి శ్రీరాముని ఆశీస్సులు కోరుకున్నారు. కార్యక్రమం భక్తి, సాంస్కృతిక వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.